దేశ వ్యాప్తంగా ఉచిత విద్యను అమలుపర్చాలి :
ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్
ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 10 ; విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు నిర్విరామంగా పోరాటాలు చేస్తామని అఖిల భారత విద్యార్థి సమాఖ్య,(ఏఐఎస్ఎఫ్)జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ అన్నారు.గురువారంనాడు గోలేటిలోని కేఎల్ మహేంద్ర భవన్ లో డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఏఐఎస్ఎఫ్ గోలేటి పట్టణ సమావేశానికి ముఖ్య అతిధిగా రవీందర్ పాల్గొని మాట్లాడుతు ఏఐఎస్ఎఫ్ బలోపేతానికి కృషి చేయాలనీ అన్నారు.రాష్ట్రంలో,దేశంలో విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకురావాల్సి ఉన్నదని,విద్య విధానంలో కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ప్రవేశపెట్టాలని,ప్రతి ఒక్క విద్యార్థికి ఉచిత విద్యను అందించాలని అన్నారు.కానీ ఈ ప్రభుత్వాలు విద్య వ్యవస్థను కార్పోరేట్,ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి అప్పగించి విద్యను వ్యాపారం చేస్తున్నాయని విమర్శించారు.విద్యా వ్యాపారీకరణ,కాషాయీకరణ,ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చెయ్యాలని పిలుపునిచ్చారు.తెలంగాణలో కేజీ టూ పీజీ విద్యను అమలు పర్చాలని డిమాండ్ చేశారు.డిగ్రీ చదువులో డిటెన్షన్ విధానాన్ని అమలు పర్చాలని తెరాస ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెంటనే డిటెన్షన్ విధానాన్ని విరమించుకోవాలని అన్నారు.పెండింగ్ లో ఉన్నా బోధనారుసుములు,ఉపకారవేతనాలు వెంటనే విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు.కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏర్పడి 10నెలలు గడుస్తున్నా జిల్లా కేంద్రంలో ఐటిఐ,డిగ్రీ,పాలిటెక్నిక్ కళాశాలల మాటే లేదని,కళాశాలలను వచ్చే విద్య సంవత్సరంలో ప్రారంభించాలని డిమాండ్ చేశారు.ఏఐఎస్ఎఫ్ పోరాటాల ఫలితంగా సాధించుకున్న రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనం పూర్తి అయ్యి మూడు సంవత్సరాలు అయినప్పటకి,దానికి విద్యుత్,వివిధ సౌకర్యాలు కల్పించి తరగతులు ప్రారంభం చేయడంలో ఇప్పటి అధికారులు,ప్రజాప్రతినిధులు పూర్తిగా వైఫల్యం చెందారని అన్నారు.విద్య వ్యవస్థలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తంతు సాగుతుందని అన్నారు.ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రెబ్బెన మండల అధ్యక్షులు ఎం.మహిపాల్,కార్యదర్శి పర్వతి సాయికుమార్,గోలేటి పట్టణ అధ్యక్షులు పడాల సంపత్,కార్యదర్శి జాడి సాయికుమార్,నాయకులు రాజేష్,రాజ్ కుమార్,కృష్ణ,సంజయ్,కిరణ్,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment