Wednesday, 30 August 2017

భారతీయ జనతా పార్టీ ఎస్ సీ మోర్చా జిల్లా సమావేశం

భారతీయ జనతా పార్టీ ఎస్ సీ  మోర్చా జిల్లా సమావేశం 


  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 30 ;   భారతీయ జనతా పార్టీ ఎస్ సీ  మోర్చా జిల్లా సమావేశం బుధవారంనాడు జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజు ముఖ్య అతిధి గ హాజరై మాట్లాడుతూ  కేంద్రప్రభుత్వం నరేంద్ర మోదీగారి నేతృత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలలోనికి విస్తృతంగా తీసుకువెళ్లాలని ,మోడీగారు ప్రవేశపెట్టిన స్టాండ్ అప్ ఇండియా కార్యక్రమం, ఎస్ సీ   లు, బి సి లు స్వంతంగా తమా కాళ్లపై నిలువడానికి ఉద్దేశించిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి దళితులను మోసంచేస్తున్నారని,,దళితులకు ఇస్తానన్న మూడు ఎకరాల భూమి,డబల్ రూమ్ ఇండ్లు లాంటిపథకాలు అన్ని మోసపూరితాలేనని అన్నారు. ఈ కార్యక్రమంలో బి సి మోర్చా అధ్యక్షులు పి  తిరుపతి, బీజేపీ దళితమోర్చ అధ్యక్షులు రాంటెకి భీం రావు, ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు ఖండ్రి విశాల్ ,దీపక్ ,విజయకుమార్, శంకర్, తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment