ఏఐఎస్ఎఫ్ నాయకులపై దాడి సిగ్గుచేటు ;
ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 11 ; కామారెడ్డిలో జెఎసి ఆద్వర్యంలో నిర్వహిస్తున్న అమరవీరుల స్పూర్తి యాత్రలో పాల్గొన్న ఏఐఎస్ఎఫ్ నాయకులపై తెరాస నాయకులు దాడి చేయడం సిగ్గుచేటని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ అన్నారు. శుక్రవారం రోజున విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కామారెడ్డిలో శాంతియుతంగా నిర్వహిస్తున్న అమరవీరుల స్పూర్తి యాత్రలో పాల్గొన్న వారిపై రాళ్ళతో,కోడి గుడ్లతో,కూర్చిలతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చరని ఈ దాడిలో ఏఐఎస్ఎఫ్ కామారెడ్డి జిల్లా కోశాధికారి పృథ్వి తీవ్రంగా గాయపడ్డారని, పృథ్వికి ఎలాంటి హనీ జరిగిన రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.రాజ్యాంగం ప్రకారం నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్క పౌరునికి ఉందని,ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నరని అన్నారు.సభలో తెరాస . నాయకులు, కార్యకర్తలు గుండాలుగా వ్యవహరించి దాడి చేయడం తెరాస యొక్క విధానం బయటపడిందని అన్నారు.ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై దాడులు చేస్తూ,అక్రమంగా అరెస్టులు చేసి,కేసులు బనాయించడం చూస్తుంటే కేసీఆర్ నియంత పాలన కనపడుతుందని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన మాత్రమే కొనసాగించాలని,నియంతల వ్యవహరిస్తున్నడని అన్నారు.తెరాస నాయకుల దాడిలో గాయపడిన పృథ్వికి ఏం జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్,ఏఐటీయూసీ మండల కార్యదర్శి నర్సయ్య,ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు కస్తూరి రవీ,మండల కార్యదర్శి పర్వతి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు..
No comments:
Post a Comment