Tuesday, 8 August 2017

బీవైబీఎస్ అద్వర్యంలో ఆసుపత్రిలో పండ్లు పంపిణి

బీవైబీఎస్ అద్వర్యంలో ఆసుపత్రిలో పండ్లు పంపిణి
 
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 08 ;   బెటర్ యూత్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో రెబ్బెన ప్రాధమిక ఆరోగ్య  కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణి చేశారు.బెటర్ యూత్ బెటర్ సొసైటీ స్వచ్చంద సేవా సంస్థ  మూడవ వార్షికోత్సవం సందర్బంగా  ఆసుపత్రిలో పండ్లు పంపిణితో పాటు గుడ్లు పంపిణి చేసారు.అలాగే  గోలెటి బస్టాండ్ లో మొక్కలు నాటారు.అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.సేవా సంస్థ అధ్యక్షులు ఓరగంటి రంజిత్ కుమార్ మాట్లాడుతు సంస్థ ఏర్పాటు చేసినప్పటి నుండి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నామాల రాజశేఖర్,ప్రధాన కార్యదర్శి రవీందర్,సభ్యులు వెంకటేష్,తిరుపతి,సంజయ్,రాజేష్,సత్యనారాయణ,విజయ్,తిరుపతి,సాయి,గౌరవ అధ్యక్షులు లక్ష్మణ చారి.ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment