Saturday, 5 August 2017

విత్తన బంతులతో మొక్కలు నాటడం సులభం ; బెల్లంపల్లి ఏరియా జీఎం రవిశంకర్

విత్తన బంతులతో మొక్కలు నాటడం సులభం 
                       బెల్లంపల్లి ఏరియా జీఎం రవిశంకర్ 
  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 05;  విత్తన బంతులు(సీడ్ బాల్స్)తో మొక్కలను సులభంగా నాటడంతో పాటు,మనుషులు వెళ్లలేని ఎత్తు మరియు లోతట్టు ప్రాంతాలలో మొక్కలు నాటడము ఎంతో సులభం అని బెల్లంపల్లి ఏరియా జనరల్  మేనేజర్ కాటేపల్లి రవిశంకర్ అన్నారు.శనివారం రోజున ఎస్వోటూ జీఎం కొండయ్యతో కలసి ఆయన గోలేటిటౌన్ షిప్ లోని ఏరియా నర్సరీని సందర్శించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 50000 విత్తన బంతులను తయారు చేయడం జరిగిందని,మరో 50000 విత్తన బంతులు  నాటేందుకు సిద్దoగా ఉన్నాయని తెలిపారు.విత్తన బంతుల ద్వారా త్వరగా ప్లాంటేషన్ అవుతుందని,ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ ల డంప్ యార్డులలో మొక్కలు నాటి చెట్లను పెంచడం చురుగ్గా చేపట్టడం  జరుగుతుందన్నారు.బెల్లంపల్లి ఏరియాలోని కైరీగూర,డోర్లి-1,డోర్లి-2,బిపిఎ ఓసీపీ-2,డంప్ యార్డులల్లో విత్తన బంతులు చల్లడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.మూడో విడత హరితహారంలో భాగంగా ఈ సంత్సరం బెల్లంపల్లి ఏరియా పరిధిలో ఆరు లక్షల మొక్కలను నాటే  లక్ష్యంలో  భాగంగా ఇప్పటి వరకు 369500 మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు.

No comments:

Post a Comment