నిమజ్జనం, శోభ యాత్ర లకు బందోబస్తు ను పకడ్బంది గా నిర్వహించాలి ; జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 29 ; గణపతి నవరాత్రుల సందర్భంగా ,నిమజ్జనం,శోభాయాత్ర ల బందోబస్తును పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ అన్నారు. మంగళవారం కాగజ్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖి చేసిన జిల్లా ఎస్పి స్టేషన్ యొక్క పరిసరాలను పరిశీలించి, స్టేషన్ నిర్వహణ పని తీరు ను గమనించారు మరియు గణపతి నవరాత్రుల దృష్ట్యా తీసుకుంటున్న భద్రత చర్యల గురుంచి అడిగి తెలుసుకున్నారు, కాగజ్ నగర్ రూరల్ మరియు పట్టణం లో శోభ యాత్ర , నిమజ్జనం జరిగే ప్రాంతాల రూట్ మ్యాప్ ను జిల్లా ఎస్పి పరిశీలించారు, శోభ యాత్ర ల లో డి.జే లను వాడవద్దని, ప్రజలకు ఇబ్బంది కలిగేలా బాణసంచ కాల్చకుండా చర్యలు తీసుకోవాలని ,నిమజ్జనం జరిగే ప్రదేశాల వద్ద ముందస్తు గా అప్రమత్త తో వుండాలని నిమజ్జనం జరిగే ప్రదేశాల వద్ద గజ ఈతగాళ్ళను , లైటింగ్ , జెనరేటర్ మరియు క్రేన్ లను ముందస్తు గా అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా ఎస్పి ఆదేశించారు, ,ఎలాంటి అవాంచనియ ఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలను తిసుకోవాలని జిల్లా ఎస్పి ఆదేశించారు. జిల్లా ప్రజలు ప్రశాంతముగా సోదరబావం తో పండుగ లు నిర్వహించుకొని పోలీసులకు సహకరించాలి అని జిల్లా ఎస్పి కోరారు. ఈ కార్యక్రమం లో కాగజ్ నగర్ డిఎస్పి హబీబ్ ఖాన్ ,ఎస్పి సీసీ దుర్గం శ్రీనివాస్ , కాగజ్ నగర్ టౌన్ సి ఐ వెంకటేశ్వర్,రూరల్ సిఐ ప్రసాద్ రావు, టౌన్ ఎస్సై ప్రభాకర్ రెడ్డి ,రూరల్ ఎస్సై రాజేష్ కుమార్,పిఆర్.ఓ మనోహర్ లు మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment