కేంద్ర ప్రభుత్వ పథకాలకు విస్తృత ప్రచారం చేయాలి ; బీజేపీ జిల్లా అధ్యక్షులు జ్ బి పౌడెల్
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 06; కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు ప్రజాప్రయోజన పథకాలను గ్రామస్థాయిలో ప్రజలవద్దకు తీసుకువెళ్లాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు జ్ బి పౌడెల్ అన్నారు. ఆదివారం రెబ్బెన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మండల అధ్యక్షులు కుందారపు బాలకృష్ణ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశానికి ముఖ్య అతిధిగా జిల్లా అధ్యక్షులు జ్ బి పౌడెల్ హాజరయ్యారు . ఈ సమావేశంలో మాట్లాడుతూ పార్టీని బూత్ స్థాయి నుండి బలోపేతం చేసి రాబోయే 2019 సార్వత్రిక ఎన్నికలలో అధికారంలోకి రావడానికి పార్టీ శ్రేణులు కృషిచేయాలని కేంద్రంలోని నరేంద్రమోడీ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు ప్రజాప్రయోజన పథకాలను గ్రామస్థాయిలో ప్రజలవద్దకు తీసుకువెళ్లాలని,అదేవిధంగా టి ఆర్ ఎస్ ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాలను,ఎలక్షన్ సమయంలో ఇచిన హామీలను నెరవేర్చక పోవడాన్ని, ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలవద్దకు తీసుకువెళ్లాలని పులుపినిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గౌడ్,జిల్లా ఉపాధ్యక్షలు కృష్ణ కుమారి ,అసెంబ్లీ కన్వీనర్ గుల్బమ్ చక్రపాణి ,బి సి సెల్ ప్రధాన కార్యదర్శి రాచకొండ రాజయ్య ,రత్నం లింగయ్య ,మధుకర్ ,మల్లేష్ ,కనకయ్య ,సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment