పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణానికి భూమిపూజ
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 17 ; నూతనముగా నిర్మించతలపెట్టిన రెబ్బెన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి ఎం ఎల్ ఏ కోవా లక్ష్మి, జిల్లా పాలనాధికారి చంపాలాల్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సన్ ప్రీత్ సింగ్ లు గురువారం భూమిపూజ చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి నాందిగా చిన్నజిల్లాలను ఏర్పాటు,చేసి వాటికి అవసరమైన అన్నివసతుల కల్పనలో భాగంగా స్వంత భవనాలను ఏర్పాటు చేస్తూ ప్రజలకు మరింత సౌకర్యంగా ఉండేందుకు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రెబ్బెన తహసీల్దార్ రమేష్ గౌడ్, జడ్పీటీసీ బాబురావు,ఎం పి ట్ సి సంజీవకుమార్ ఆసిఫాబాద్ మార్కెట్ చైర్మన్ గండం శ్రీనివాస్ ,ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ, స్థానిక నాయకులు తదితరులు హాజరయ్యారు.
No comments:
Post a Comment