కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) ఆగష్టు 04; బడి ఈడు పిల్లలు బడిలోనే వుండాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ చేపట్టిన కార్యక్రమము లో భాగముగా శుక్రవారం తిర్యాణీ మండల కేంద్రము లో ఆశ్రమ పాఠశాల లో డ్రాప్ ఔట్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భముగా జిల్లా జాయింట్ కలెక్టరు అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జిల్లా ఎస్పీ గారు తలపెట్టిన కార్యక్రమం బృహత్తర మైనదని అభిప్రాయపడ్డారు మరియు పిల్లల తల్లి దండ్రుల కు కూడా అవగాహన కల్పించడం,బడి మానివేయుటకు గల కారణాలు అన్వేషించి వాటిని వాటిని అదిగమించెలా చేయడం ,మండల మొత్తం పాఠశాల లో సర్వే చేసి లాంగ్ ఆబ్సెంట్ ,స్కూల్ డ్రాప్ ఔట్ విద్యార్థుల లిస్ట్ ను గ్రామ,గ్రాముల వారీగా తయారు చేసి వారిని పాఠశాల లో చేర్పించి పోలీసులు విద్య పట్ల వారి అభిమానాన్ని పోలీసులు చాటుకుంటున్నారు అని జెసి,ఆర్డీఓ, లు అభిప్రాయపడ్డారు, జిల్లా లో కూడా పోలీసు మరియు విద్య శాఖ అధికారుల సమన్వయము తో పని చేసి స్కూల్ డ్రాప్ ఔట్ లు లేకుండా చూడాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో డ్రాప్ ఔట్ విద్యార్థులకు తిర్యాని ఏసై బగ్గని శ్రీనివాస్ పుస్తకాలు, పెన్నులు అందచేశారు.ఈ కార్యక్రమం లో ఆర్డీవో కే.సురేశ్, తహశీల్దార్ అమృత్ సాగర్, ఎం.ఈ.ఓ శంకర్, తీర్యాణీ ఏసై బగ్గాని శ్రీనివాస్, ఆశ్రమ పాఠశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ నర్సింహులు, పోలీసు సిబ్బంది మరుపక కిరణ్ , రాజకుమార్,చందు, మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment