Wednesday, 9 August 2017

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జెఎసి చైర్మన్ కోదాండరాం కొమురంభీం జిల్లా పర్యటన

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా  జెఎసి చైర్మన్ కోదాండరాం    కొమురంభీం జిల్లా పర్యటన 

  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 09 ;   ప్రపంచ  ఆదివాసి  దినోత్సవం సందర్భంగా   కొమురంభీం జిల్లా  కాగజ్ నగర్ పట్టణంలో బుధవారం పద్మశాలి భవన్ లొ  ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కోదండరామ్ మాట్లాడుతు 2005 అటవి భూమి యాజమాన్య హక్కుల క్రింద ఇచ్చిన భూములు ఆదివాసీలకే చె౦దుతాయని అన్నారు.పోడు వ్యవసాయం చెస్తున్న గిరిజనులపై  అటవి అధికారులు మరియు ,ప్రభుత్వం వేధించడం  సరి కాదని,అటవిభూముల హక్కుల షెడ్యూల్ 5,6 ప్రకారం గిరిజనుల హక్కులకు భ౦గ౦ వాటిల్లరాదని అన్నారు.గిరిజనులకు అన్యాయం జరిగితే వారి కోసం పోరాడటానికి సిద్ద౦గా ఉన్నానని ఆయన అన్నారు.  అనంతరం రెబ్బెనలో  ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ తో కలిసి నూతనంగా నిర్మించిన  ప్రభుత్వ జూనియర్   కళాశాల భవనాన్ని సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ  కళాశాలకు విద్యుత్ సౌకర్యం సత్వరమే  కల్పించాలని జెఎసి చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు.  అనంతరం రవీందర్ మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ పోరాట ఫలితంగా రెబ్బెనలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కోటి రూపాయలతో స్వంత భవనం మంజూరు అయిందని,భవనాన్ని నిర్మించి విద్యుత్ సౌకర్యం కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూన్నరని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జూనియర్ కళాశాల తరగతులను కొనసాగించడం వలన తరగతి గదులు సరిపోక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నరని అన్నారు. ఇప్పటికే ఏఐఎస్ఎఫ్ ఆద్వర్యంలో జిల్లా అధికారులకు, ప్రజాప్రతినిధుల దృష్టికి పలుమార్లు సమస్యను తీసుకెళ్ళిన పట్టించుకోవడం లేదని అన్నారు. వెంటనే ప్రభుత్వ జూనియర్ కళాశాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆద్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు రమేష్, నర్సయ్య, దేవాజి తదితరులు పాల్గొన్నారు.  

No comments:

Post a Comment