Thursday, 31 August 2017

బెటర్ సొసైటీ సేవా సంస్థ అనాధ పిల్లలకు చేయూత

బెటర్ సొసైటీ సేవా సంస్థ అనాధ పిల్లలకు చేయూత 


   కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 31 ;  అనాధ పిల్లల సహాయ నిధి కోసం బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ మరియు  ఓం శ్రీ సాయి యువ గణేష్ మండలి వారి ఆధ్వర్యం లో హైదరాబాద్ అంధ   కళాకారులచే గోలేటి లో ఓం శ్రీ సాయి యువ గణేష్ మండలి వారు ఏర్పాటుచేసిన గణేష్ మండపం  వద్ద ఆట,పాట,మ్యాజిక్ షో, ఇంద్రజాలప్రదర్శన, కార్యక్రమాలు  నిర్వహించడం జరిగింది. అనంతరం అంధ కళాకారులను బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ సభ్యులు సన్మానం చేసి బహుమతి ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ అధ్యక్షులు ఓరగంటి రంజిత్, ఉపాధ్యక్షులు రవీందర్,రాజశేఖర్  సభ్యులు , సాయి,తిరుపతి,వెంకటేష్,రాకేశ్,తిరుపతి,సంజయ్,రమేశ్, మరియు వికలాంగుల కమిటీ వారు రమేశ్,సుజాత,నాగమణి,రాజు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment