కాంట్రాక్టు కార్మికుల సీఎంపిఇఫ్ వివరములు తెలియజేయాలి;ఏఐటీయూసీ
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 04; సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సీఎంపిఇఫ్ వివరములు తెలియ చేయాలనీ గత 4 సంవత్సరాల నుంచి సింగరేణి యాజమాన్యం ఎలాంయి ఆధారాలు చూపించడం లేదని, దింతో కార్మికుల పరిస్థితి గందర గోలంగా తయారైదని సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ గోలేటి అధ్యక్షులు బోగే ఉపేందర్ అన్నారు. రెబ్బెనలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో విలేకర్ల సమావేశంలో అయన మాట్లాడారు. గత 4 సంవత్సరాల నుండి అనేక ఉద్యమాలు ఏఐటీయూసీ అద్వర్యం లో చేశామని ఆయన యాజమాన్యం పట్టించుకోవటం లేదు అని అన్నారట. రస్తా రోకో ,సమ్మెలు, ఆందోళకా కార్యక్రమాలను చేశామని అయినప్పటికీ యాజమాన్యం స్పందించడం లేదని అన్నారు. సిఎంపిఇఫ్ వివరములు తెలియ చేయని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను చేస్తాం అని అన్నారు. ఆసుపత్రి పుస్తకాలూ గత సంవత్సర కలం నుంచి ఇవ్వడం లేదని దింతో కార్మికులు అనారోగ్యపాలై అప్పులు చేసి ప్రవేటు వైద్యం చేసుకుంటూ ఆర్థికంగా చాల నష్ట పోతున్నారని అన్నారు. ఈ సమావేశంలో గోలేటి బ్రావి కార్యదర్శి చల్లూరి షాక్, ఏఐటీయూసీ మండల కార్యదర్శి రాయల్లా నరసయ్య, నాయకులూ డి. సతీష్ లు ఉన్నారు.
No comments:
Post a Comment