కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 22 ; శాంతి, మత సామరస్యములే సమాజ ప్రగతికి రథచక్రములని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ ప్రేమల గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో జిల్లా మత పెద్దల సమక్షం లో జిల్లా ఎస్పి అద్యక్షతన రానున్న పండుగల నేపద్యం లో శాంతి సమావేశం ను నిర్వహించారు, ఈ శాంతి సమావేశము లో జిల్లా ఎస్పిమాట్లాడుతూ శాంతి తో పండుగలు ఆనందోత్సాలతో జరుపుకోవాలని జిల్లా ఎస్పి ఆకాంక్షించారు, అందుకు పోలీస్ శాఖ కు సహకరించినట్లైతే ఉత్సవ నిర్వహకులకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటారని అందుకే ప్రతి వినాయక మండప నిర్వాహకులు తప్పని సరిగా సమీప పోలీస్ స్టేషన్ నందు వివరాలు తెలిపినట్లితే ముందస్తు ప్రణాళిక తో అన్ని శాఖల సమన్వయంతో పోలీసులు ఏర్పాట్లు చేస్తారని జిల్లా ఎస్పి తెలిపారు. మత పెద్దలు మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లా శాంతి కాముకమమైన జిల్లా అని ఇక్కడ పలు మతాల వారు సోదరభావం తో ఉంటారని ఇక్కడ ఎలాంటి మతప్రమేయ శక్తులకు తావు లేదని, తాము పరస్పర సహకారం తో జిల్లా లొ పండుగలను నిర్వహించుకుoటామని తెలిపారు. జిల్లా లో గణేశ్ ఉత్సవాలు, బక్రీద్ వంటి పండుగలు శాంతియుత వాతావరణం లో జరిగేలా జిల్లా లో 4 అంచెల భద్రత ను ఏర్పాటు చేశామని తెలిపారు.
No comments:
Post a Comment