శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి
రెబ్బెన సర్కిల్ ఇన్స్పెక్టర్ మదన్ లాల్
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 22 ; గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా,సామరస్యంగా జరుపుకోవాలని రెబ్బెన సర్కిల్ ఇన్స్పెక్టర్ మదన్ లాల్ అన్నారు.మంగళవారం మండలకేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో మండలంలోని గణేష్ మండపాలు ఏర్పాటు చేయదలుచుకున్న నిర్వాహకులతో సీఐ సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ మండపాల నిర్వాహకులు అధికారులతో సమన్వయం చేసుకుంటూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరిగేలా,వినాయకుల నిమజ్జనం రోజున నిమజ్జన కార్యక్రమంలో సంయమనంతో నడుచుకోని,ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.చట్టానికి లోబడి కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు.ఎవరైనా సరే నిబంధనలను అతిక్రమించినట్లైతే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. గతేడాది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సామరస్యంగా వినాయక నిమజ్జనం జరిగిందన్నారు. మండపాలల్లో ఏర్పాటు చేసే విద్యుత్తు దీపాలతో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో రెబ్బెన సర్పంచ్ పెసర వెంకటమ్మ ,ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, కో ఆప్షన్ సభ్యుడు జాకిర్ ఉస్మాని, గంటు మేర, చిరంజీవి ,మోడెమ్ సుదర్శణగౌడ్, మద్ది శ్రీనివాస్, శంకర్, జాబి, రాజాగౌడ్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు

No comments:
Post a Comment