సీఐటీయూ జిల్లా మొదటి మహాసభల సన్నాహక సమావేశం
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ ఆగష్టు 03 ; కొమరంభీం జిల్లా సీఐటీయూ మహాసభలు సెప్టెంబర్ 9,10,11 తేదీలలో జరగనున్న సందర్భంగా రెబ్బెన ఆర్ అండ్ బె గెస్ట్ హౌస్ లో సీఐటీయూ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముంజం శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మిక ,కర్షక ప్రయోజానాలు , హక్కులు కాపాడటంలో విఫలమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వై ఖరికి వ్యతిరేకంగా సీఐటీయూ ఐక్య పోరాటం చేయడంతోనే సాధించుకోవచ్చని అన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు అల్లూరి రాకేష్ మాట్లాడుతూ సీఐటీయూ అనుబంధ సంఘాలైనాఆంగన్ వాడి టీచర్లు మద్యాహ్న భోజన పధకం కార్మికులు,ఆశ,ఐ కేపి , వీ ఒ ఏ లు గ్రామపంచాయితీ సంఘటిత అసంఘటిత ఉద్యోగులు ,కార్మికులు తమ హక్కుల సాధనకై సీఐటీయూ ఇచ్చే ఐక్య పోరాటాలలో తమవంతు హాజరై జయప్రదం చేయాలనీ ఈ విషయంలో రెబ్బెన మండల కమిటీ తగిన కృషి చేసి సెప్టెంబర్ జరిగే జిల్లా మొదటి సీఐటీయూ సభలను జయప్రదం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో స్వరూప ,లక్ష్మి , విజయ , పోషక్క , తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment