విద్యార్థులకు విద్య సామాగ్రి పంపిణి
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 28 ; రెబ్బెన మండలంలోని పులికుంట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు రెబ్బెన వాస్తవ్యులు ఐన వ్యాపారి భరత్ కొడియర్ మరియు వారి కుటుంబ సభ్యులువిద్యార్థులకు అవసరమైన పుస్తకాల సంచులు, నోటుపుస్తకాలు,పెన్నులు,పెన్సిళ్లు, పంపిణి చేశారు. వారు మాట్లాడుతూ పేద విద్యార్థులు అందరు చదువుకునేలా విద్యార్థుల సౌకర్యార్ధం విద్య సామాగ్రి తదితర వస్తువులు అందిస్తూ విద్యావ్యాప్తికి తమవంతు విధిగా ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానఉపాధ్యాయుడు శ్రీనివాస్, పాఠశాల కమిటీ చర్మన్ టి పోశన్న, గ్రామస్తులు బి పోచమల్లు, ఇ సుధాకర్, బి లక్ష్మి మరియు ఉపాధ్యాయురాలు ఇ స్వప్న తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment