రాఖి పండగ సందర్బంగా సిస్టర్ ఫర్ చేంజ్ కార్యక్రమం
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 04; ఎం పి కవిత ప్రారంభించిన సిస్టర్ ఫర్ చేంజ్ కార్యక్రమం స్ఫర్తిని చాటడానికి తెలంగాణ జాగృతి విద్యార్ధి సమైక్య ఆధ్వర్యంలో రెబ్బెన మండల కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా రెబ్బెన ఎస్ ఐ నరేష్ కుమార్ హాజరయ్యారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో ఎంతో మంది హెల్మట్ లు ధరించక ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని ,ద్విచక్ర వాహనదారులు తప్పక శిరస్త్రాణం ధరించాలని ఎంపీ కవిత ప్రారంచిన సిస్టర్ ఫర్ చేంజ్ అనే కార్యక్రమ విశిష్టతను గుర్తించి ఈ రాఖి పండగకు అక్క చెల్లలు అన్నదమ్ములకు హెల్మట్ ను బహుకరించాలని సూచించారు. ఈ కార్యక్రంలో తెలంగాణ జాగృతి విద్యార్ధి సమైక్య నియోజక వర్గ కన్వీనర్ తణుకు సాయి శ్రావణ్,రవి, రాజ్కుమార్, శ్రీకాంత్,వెంకటేష్, సతీష్ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment