Sunday, 27 August 2017

రెడ్డి జాగృతి జిల్లా కన్విన్నార్ గా పోటు శ్రీధర్ రెడ్డి

రెడ్డి జాగృతి జిల్లా కన్విన్నార్ గా   పోటు  శ్రీధర్ రెడ్డి 

 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 27 ;      కొమురం బీమ్ జిల్లా రెడ్డి జాగృతి కన్వీనర్ గా    పోటు  శ్రీధర్ రెడ్డి ని నియమించడం జరిగిందని రెడ్డి జాగృతి జిల్లా ఇంచార్జ్ ఎర్రం తిరుపతి తెలిపారు .  ఆదివారం  రెబ్బన అతిథి గృహం లో రెడ్డి బంధువుల  సమక్షం లో ఎన్నుకున్నామని ఈ సమక్షం లో కో కన్వీనర్  గా కే సమ్మిరెడ్డి,ఎర్ర మనోహర్ రెడ్డి,అమర్నాధ్ రెడ్డి,కే వెంకట్ రెడ్డి,లను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు . ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఐదు వేల కోట్ల రూపాయలతో రెడ్డి కార్పోరేషన్ ను ఏర్పాటు చేయాలన్నారు. పెద విద్యార్థుల కోసం రెడ్డి రెసిడెన్షియల్  హాష్టళ్ళని ఏర్పాటు చెయ్యాలని రైతులు ప్రమాదం  లో మరణిస్తే  ఐదు లక్షల  రూపాయిలు మంజూరు చేయాలన్నారు ఆరోగ్య శ్రీ కార్డుని వర్తింపజేయాలన్నారు ఈ కార్యక్రమం లో టీ సతీష్ రెడ్డి,జి సాయికిరణ్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment