విద్యారంగ సమస్యలు సత్వరమే పరిష్కరించాలి ; ఏబీవీపీ
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ ఆగష్టు 01 ; విద్యారంగ సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కొమురంభీం జిల్లా ఏబీవీపీ నాయకులూ గోగర్ల రాజేష్ ఆధ్వర్యంలో రెబ్బెన తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఊర్మిళ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కళాశాలను నూతన భవనంలోకి తరలించి మౌలిక వసతులైన విడుతు,నీరు,మొదలగు సౌకర్యాలను కల్పించాలని,ప్రభుత్వపాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతతో అందించాలని అలాగే రెబ్బెనలో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థను స్థాపించాలని ,విద్యార్థులకు పెండింగ్లోఉన్న ఉపకార వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్,సంతోష్,శ్రీనివాస్, నవీన్ ,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment