Saturday, 12 August 2017

ఎన్నికల హామీలను తెరాస అమలు చేయాలి ; సిపిఐ మాజీ శాసన సభ్యులు గుండా మల్లేష్

ఎన్నికల హామీలను తెరాస అమలు చేయాలి
            సిపిఐ మాజీ శాసన సభ్యులు గుండా మల్లేష్

 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 12 ;    రాష్ట్ర ముఖ్యమంత్రి  కెసిఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను అమలు చేయాలని సిపిఐ మాజీ శాసన సభ్యులు గుండా మల్లేష్ డిమాండ్ చేశారు. శనివారం రోజున గోలేటిలోని కెఎల్ మహేంధ్ర భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కెసిఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలు దళితులకు మూడు ఎకారాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, జిల్లాకు సూపర్ స్పెషలిటి హస్పిటల్ ను మంజూరు చేస్తామని చెప్పి నేటి వరకు ఒక్క హమీ అమలు చేయలేదని అన్నారు. దేశంలో దళితులపై దాడులు జరుగుతున్న బిజెపి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. నిన్న కామారెడ్డిలో జెఎసి ఆద్వర్యంలో తలపెట్టిన అమరవీరుల స్పూర్తి యాత్రలో టి.ఆర్.ఎస్. నాయకులు కార్యకర్తలు జెఎసి నాయకులపై,ఏఐఎస్ఎఫ్ నాయకులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూన్నమని అన్నారు. ప్రశ్నించే వారిపై భౌతిక దాడులకు దిగితే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. నిరసనలు తెలిపెందుకు రాజ్యాంగం హక్కులు కల్పించిందని ఆ హక్కులను కాలరాయడం సరికాదని అన్నారు. నెరెళ్ళలో జరిగిన సంఘటనలో పోలీసుల పాత్రపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డిలో ఏఐఎస్ఎఫ్ నాయకులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేణ శంకర్,జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ,ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్,జిల్లా నాయకులు జగ్గయ్య,ఉపేందర్,నర్సయ్య,ఒదేలు,గణేష్,తిరుపతి,పిడుగు శంకర్ తదితరులు పాల్గొన్నారు...

No comments:

Post a Comment