Thursday, 10 August 2017

బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం

బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం 
   కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 10 ; ఆగస్ట్ 1వ తేదీన ఆసిఫాబాద్ మండలం  చిన్న రాజూర గ్రామంలో ట్రాక్టర్ ప్రమాదంలో చనిపోయిన వాజిద్ అనే వ్యక్తీ కుటుంబానికి 6500/-రూపాయల ఆర్ధిక సహాయాన్ని అసిఫాబాద్ యువజన సంఘాల జేఏసీ నాయకులూ అందించారు.అలాగే వారి కుటుంబానికి ఎలాంటి సహాయం అవసరం ఉన్న ఆసిఫాబాద్ యువజన జేఏసీ  సహాయ పడడానికి సిద్ధంగా ఉందని భరోసానిచ్చారు.ఈ కార్యక్రమంలో యువజన సంఘం ప్రతినిధులు ప్రతాప్ కుమార్,అనుమండ్లా సాయి క్రిష్ణ,కార్తీక్,అమర్,రాకేష్, రాజేందర్,సాయి,సంజీవ్,రాజ్ కుమార్,ఖజా మోయినోద్దిన్ తదితరులు పాల్గొనడం జరిగింది.

No comments:

Post a Comment