Tuesday, 8 August 2017

మండల యువజన జేఏసి ఎన్నిక

మండల యువజన జేఏసి ఎన్నిక 
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 08 ;     ఆసిఫాబాద్ మండల యువజన జేఏసీ నూతన కార్యవర్గాన్ని మంగళవారం  ఆసిఫాబాద్ పట్టణంలోని స్థానిక రోజ్ గార్డెన్ లో ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో మండలంలోని పలు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొనగా.గౌరవ అధ్యక్షులుగ వైరాగారే ప్రతాప్ కుమార్,మండల అధ్యక్షులుగ  అనుమండ్ల సాయిక్రిష్ణ,ఉపాధ్యక్షులుగ ఎస్.యాదవ్,ఎం.వినోద్,పులి సతీష్,శ్యామల అమర్,ప్రధాన కార్యదర్శిగ చంద్రశేఖర్,సహాయ కార్యదర్శలుగ కే.నాందేవ్,వినీత్,వై.రవి,పెద్దింటి రాకేశ్,కోశాధికారిగా సుశీల్ కుమార్,ప్రచార కార్యదర్శిగ చునార్కార్ రాజ్ కుమార్,అధికార ప్రతినిధులుగ షేక్ సమీర్, రాందాస్ లను  ఎన్నుకున్నారు.అనంతరం యువజన సంఘాల నాయకులు యువత ఎదుర్కొంటున్న  సమస్యలు,వారికి జరుగుతున్నా అన్యాయం,నిరుద్యోగం మరియు యువత పై రాజకీయ ఒత్తిడిలు మానుకోవాలని,స్వయం ఉపాధి రుణాలను అర్హులైన నిరుద్యోగ యువతకే కేటాయించాలని కోరుతు అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి వినతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమం అనంతరం మొన్న జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో మరణించిన జావీద్ కుటుంబానికి యువజన నాయకులు జేఏసీ తరుపున  ఆర్ధిక సహాయం అందజేశారు.   

No comments:

Post a Comment