Friday, 18 August 2017

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 367వ జయంతి

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 367వ  జయంతి  


  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 18 ;   శ్రీ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 367వ జయంతి పురస్కరించుకొని జయంతిని శుక్రవారం రోజున రెబ్బెన మండల కేంద్రంలోని రోడ్లు మరియు భవనాలు అతిధి గృహంలో  గౌడ కులస్థులు  ఘనంగా  నిర్వహించారు.ఈ సందర్భంగా తెలంగాణ గౌడ సంఘ జిల్లా అధ్యక్షుడు మోడెం సుదర్శన్గౌడ్,రెబ్బెన మండల ఎంపీపీ కార్నాథం సంజీవ్ కుమార్  ముఖ్య అతిధిగ పాల్గొని  మాట్లాడుతూ  ఆనాటి మొగలుల కాలంలో పంటల పై వేసే పన్ను కంటే కళ్ళు పై వేసే పన్ను అధికంగా ఉండేదని ఆనాడు బిసి కులాలు దళిత వర్గాలు ఏకం చేసి జమిందారులు,సుబెదరులకు  ఎదురుతిరిగి పోరాటం చేసిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్నది అని అన్నారు.ఈ కార్యక్రమంలో గౌడ హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు కేసరి ఆంజనేయులుగౌడ్,ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ,రెబ్బెన ఉపసర్పంచ్ బొమినేని శ్రీధర్ కుమార్,జిల్లా కార్యదర్శి కొయ్యడ రాజగౌడ్,గౌడ  కులస్థులు చిరంజీవి గౌడ్, మడ్డి శ్రీనివాస్ గౌడ్, లక్ష్మి నారాయణ గౌడ్,కిష్టాగౌడ్,వీరమల్లుగౌడ్,టి.మహేష్ గౌడ్,శాంతి గౌడ్,జి.భార్గవ్ గౌడ్,తిరుపతిగౌడ్,వివిధ కుల సంఘాల నాయకులు కడ్తల మల్లయ్య,రాపాళ్ళ శ్రీనివాస్,ఇప్ప భీమయ్య,బొంగు నరసింగ రావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment