వార్త పత్రికలను కించపరచడం చాల బాధకారం
టిడబ్ల్యూజేఎఫ్,ఐఎఫ్డబ్ల్యూజే
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 05; తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వార్తా పత్రికల స్వేచ్ఛను హరిస్తున్నారని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులు తీవ్రంగా విమర్శించారు. బుధవారంనాడు ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ నవతెలంగాణ పత్రికను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడడాన్ని టిడబ్ల్యూజేఎఫ్ ఖండించింది.ఈ సందర్బంగా వారి నిరసనను తెల్పుతు కేసీఆర్ మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా పాలనాధికారి చంపాలాల్ కు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్బంగా టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు మాట్లాడుతు రాష్ట్రoలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలను,వారు పడుతున్న ఇబ్బందులను తెలియజేయడం కోసం పాత్రికేయులు,పత్రికలు స్వచ్చంధ పని చేస్తే వారిని విచక్షణ రహితంగా ముఖ్యమంత్రి విమర్శించడం చాలా బాధాకరం అని అన్నారు.కేసీఆర్ పాలనలో ఏ ఒక్కరికి స్వేచ్చ లేకుండా నియంత పాలనా జరుగుతుందని ఎద్దేవా చేశారు.ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలను బయటపెట్టె ప్రతి ఒక్కరిని తెలంగాణ ద్రోహులుగా పోలుస్తున్నారని అది చాల బాధాకరం అని అన్నారు.రాష్ట్రంలో పాత్రికేయులపైన జరుగుతున్న దాడులను అరికట్టాలని పత్రికల స్వేచ్ఛ,హక్కులను కాల రాయవద్దని అన్నారు.ఈ కార్యక్రమంలో పాత్రికేయులు అబ్దుల్ రహెమాన్, ప్రకాష్ గౌడ్,టి.సురేందర్,జి.మహేష్,శ్రీకాంత్,మహేందర్ లు వినతి పత్రం ఇచ్చినవారిలో ఉన్నారు.
No comments:
Post a Comment