సింగరేణి సేవాసమితి ఆధ్వర్యంలో కుట్టుశిక్షణాకేంద్రం
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 29 ; బెల్లంపల్లి ఏరియా సింగరేణి సేవ సమితి ఆధ్వర్యంలో రెబ్బెన మండల కేంద్రంలో కుట్టుశిక్షణ కేంద్రాన్ని త్వరలో ప్రారంభిస్తున్నట్లు ఏరియా డి జి ఎం పర్సనల్ జె కిరణ్ తెలిపారు.శిక్షణకాలం ఆరు నెలలుంటుందని ఆసక్తిగల రెబ్బెనలోని మహిళలు దరఖాస్తు చేసుకోవాలని తెలిపాడు. గోలేటి టౌన్షిప్ లో తైలారింగ్,బ్యూటిషన్, ఫాషన్ డిజైన్ కోర్స్ లను త్వరలో ప్రారంభిస్తున్నట్లు ఆసక్తిగల సింగరేణిలో పనిచేస్తున్న కార్మికుల కుటుంబసభ్యులు (మహిళలు) తమ దరఖాస్తులను జి ఎం పర్సనల్ డిపార్ట్మెంట్ నందు 04-09-2017 లోపు అందచేయాలని ఒక ప్రకటనలో తెలిపారు.
No comments:
Post a Comment