జిల్లాలో డిగ్రీ కళాశాలకై పోరాడుదాం
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 14 ; ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ,ఐటీఐ,పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటు చేసే వరకు పోరాడుదామని జెఎసి జిల్లా కన్వీనర్ రమేష్,ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి ఉపేందర్ తెలియజేశారు. సోమవారం రోజున ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గీతం పాఠశాలలో జెఎసి ఆద్వర్యంలో రౌండ్ టెబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం చాలా బాధకారమని అన్నారు. ఆదివాసులు,గిరిజనులు అధికంగా ఉన్న జిల్లాలో ఉన్నత విద్య లేకపోవడం వలన చాలా మంది విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నరాని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాల ఆద్వర్యంలో ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత చదువులు చదవాలంటే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి ప్రాంతాలకు వేళ్ళాల్సి వస్తుందని అన్నారు. జిల్లా అభివృద్ధి చెందాలంటే విద్య అభివృద్ధి చెందాలని అన్నారు. అదే విధంగా కొత్తగా ఏర్పాటు చేసిన మండలల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. త్వరలోనే డిగ్రీ కళాశాల కొరకు అన్ని విద్యార్థి,యువజన,కుల,ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సయ్య,సాయి,ప్రణయ్,మొండయ్య,రాజు తదితరులు పాల్గొన్నారు...
No comments:
Post a Comment