Saturday, 12 August 2017

విద్య కాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడుతాము ; ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

విద్య కాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడుతాము 
                   ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్


 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 12 ;     అఖిల భారత విద్యార్ధి సమాఖ్య  ఏఐఎస్ఎఫ్ 82 వ ఆవిర్భావ దినోత్సవం  సందర్బంగా  రెబ్బెనలో    ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్,అసిఫాబాద్ లో డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్,వాంకిడి లో డివిజన్ అధ్యక్షుడు బావునే వికాస్ లు  ఏఐఎస్ఎఫ్ జెండాను  ఆవిష్కరిoచారు.అనంతరం వారు  మాట్లాడుతు      విద్యా కాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని  అన్నారు.బ్రిటిష్ పరాయి పాలకుల చెర నుంచి మాతృ భూమి విముక్తికై  సాగిన వీరోచిత పోరాటంలో పిడికిలి బిగించి స్వాతంత్య్రం మా జన్మ హక్కు అని చాటి 1936 ఆగష్టు 12వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని లక్నో పట్టణంలోని బెనారస్ విశ్వవిద్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ను స్థాపించడం జరిగిందని అన్నారు. దేశంలో బీజేపీ,రాష్ట్రంలో తెరాస విద్యను ప్రైవేటీకరణ,కాషాయీకరణ,కార్పొరేటీకరణ చేసే ప్రయత్నాలు  చేస్తున్నాయని అలాంటి విధానాలకు ఏఐఎస్ఎఫ్ వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుందని అన్నారు.రాష్ట్రంలో తెరాస పాలన నియంత పాలనను తలపిస్తుందని,ప్రశ్నించే గొంతులను నొక్కేయడానికి అక్రమ కేసులు పెట్టి ఇబబంధులకు గురి చేస్తున్నారని అన్నారు.ఉన్నత చదువులు చదివిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండ ఈ పాలకులు నిర్లక్షం ప్రదర్శిస్తున్నారని అన్నారు.నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రెబ్బెన,అసిఫాబాద్,వాంకిడి మండలాల కార్యదర్శులు పర్వతి సాయికుమార్,గడ్డల ప్రణయ్,తిరుపతి,మహేష్,జె.సాయి,జె.సంజయ్,సిరికొండ రాజుకుమర్, అన్వార్,సాగర్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment