ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలనీ ఎం ఎల్ ఏ కి వినతి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక అసిఫాబాద్ లో విద్యార్థులు ఇబ్బందుల పాలవుతున్నారని తెలంగాణ విద్యార్ధి వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం రెబ్బెన కు వచ్చిన ఎం ఎల్ ఏ కోవా లక్ష్మికి వినతిపత్రం అందజేశారు. అనంతరం టీ వి వి జిల్లా అధ్యక్షులు కడతల సాయి మాట్లాడుతూ గతంలో ముఖ్య మంత్రి కె సి ఆర్ ఆసిఫాబాద్లో డిగ్రీ కళాశాల ఏర్పాట్లు కృషి చేస్తానని హామీ ఇచ్చ్చారారని, అలాగే బెల్లంపలికి వచ్చిన డిప్యూటీ సి యం కడియం శ్రీహరి కి అసిఫాబాద్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మిస్తామని చెప్పారు విద్య సంవత్సరం మొదలై మూడు నెలలు కావస్తున్నా విద్యార్థులు పట్ల ఎటువంటి చొరవ తీసుకోకుండా విద్యార్థుల విద్య కాలాన్ని వృధా చేస్తున్నారని అన్నారు . అందు చేత ఆసిఫాబాద్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలనీ కోరారు.స్పందించిన ఎం ఎల్ ఏ కోవా లక్ష్మిమాట్లాడుతూ సంబంధిత విద్య అధికారులతో చర్చించి కళాశాల ఏర్పాటుకై కృషి చేస్తా మని అన్నారు. ఈ కార్యక్రమంలో టి వి వి మండల అధ్యక్షుడు పార్వతి సాయి , మండల కాసాధికారి ప్రదీప్,నాయకులూ రజినీకాంత్, శ్రీకాంత్ , మహేష్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment