Sunday, 7 August 2016

మొక్కలే జీవనాధారం - టి ఆర్ ఎస్ మండల్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి

మొక్కలే జీవనాధారం - టి ఆర్ ఎస్ మండల్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); మొక్కలు భావితరాలకు జీవనాధారమని మండల టి ఆర్ ఎస్ అధ్యక్షుడు పోటు  శ్రీధర్ రెడ్డి అన్నారు . 1996-97 ఎస్ ఎస్ సి బ్యాచ్ కు చెందిన  సింగరేణి పాఠశాల విద్యార్థులు ఆదివారం రెబ్బెన మండలంలోని గోలేటిలో  కొమురయ్య వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చెట్లు నరికి వేయడముతో కాలుష్యం పెరిగిందని తెలిపారు ప్రతి ఇంటికి 2 మొక్కలు నాటితే ఊరంతా వనముల తయారు అవుతుందని పేర్కొన్నారు . ముఖ్యమంత్రి కె సి ఆర్ హరితహారము నుఉద్యమంలా తీసికెళ్ళి రాష్ట్రాన్నే పచ్చని వనముల మార్చాలనే ఆలోచనతో ఉన్నారని అన్నారు , ఇప్పటికే మండలములో ఆసిఫాబాద్ ఎం ఎల్ ఏ కోవ  లక్ష్మి ఆధ్వర్యములోవేలాది మొక్కలు నాటామని పేర్కొన్నారు. మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పర్చడానికి   ఎం ఎల్ సి  పురాణం సతీష్ కుమార్ , ఎం ఎల్ ఏ కోవ లక్ష్మి  లు కంకణం కట్టుకున్నట్లు పేర్కొన్నారు . అభివృద్ధి పనులు , సంక్షేమ పథకాలను ఎన్నో చేశారని తెలిపారు . ఈ కార్య క్రమములో కె నవీన్ కుమార్ , పత్యేమ్   కృష్ణ , రవికుమార్ , ఏ నవీన్ కుమార్ , స్వామి , శ్రీనివాస్ కుమారస్వామి , రజినివాస్  లు ఉన్నారు.

No comments:

Post a Comment