Tuesday, 9 August 2016

వాగు కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

వాగు కుంటలో  పడి ఇద్దరు చిన్నారులు మృతి 



ఇద్దరు విద్యార్థులు పి లక్ష్మి (7) జి శిరీష (8) 3 తరగతి చదువుతున్న వీరు  ఆడుకోవడానికి వెళ్లిగా  వాగు కుంటలో పడి చనిపోవడంతో  రెబ్బెన మండలంలోని కొండపెల్లి  గ్రామపంచాయితీలోని నేర్పెల్లి  (మద్దికుంట) గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మంగళవారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు ఉపాద్యాయుడు నాగరాజు మండల ఉపాధ్యాయ సమావేశం కొరకు విద్యార్థులను 12గంటలకే మధ్యాహన భోజనం కార్యక్రమాన్ని ముగించి పాఠశాలకు తాళం పెట్టి వెళ్లడంతో విద్యార్థులు మహాలక్ష్మి , మౌనిక , లక్ష్మి , శిరీష , రంజిత మండల్ , జొశ్న మండల్ కలిసి వాగు ప్రాంతానికి  ఆడుకోవడానికి వాగు నీళ్ళలోకి నడుస్తూ లోతుగా ఉన్న గుంతలో పడి మునిగి పోతుండగా మహాలక్ష్మి (12) చాకచౌఖ్యంగా సమీపంలో ఉన్న వెదురు బొంగును తీసుకొని నీటిలో మునిపోతున్న చిన్నారులకు అందించగా రంజిత , జొశ్న లు వెదురు బొంగును పట్టుకోవడంతో మహాలక్ష్మి బొంగును బయటకు లాగి ఇద్దరు చిన్నారులను కాపాడింది. అలాగే మిగతా ఇద్దరు చిన్నారులను కాపాడే ప్రయత్నంలో వెదురు బొంగు నీటిలో వేసింది కాని అప్పటికే ఆ ఇద్దరు చిన్నారులు నీటిలో మునిగి పోయారని గమననించి సమీపంలో ఉన్న స్థానికులకు తెలుపగా వాళ్ళు ఇరువురిని వెలికి తీసి ప్రాణాలు కోల్పోయారని తెలియజేశారు. ఈ దుర్ఘటన మండల విద్యాధికారుల నిర్లక్ష్యం వలన జరిగిందని మండల ఉపాధ్యాయుల సమావేశం ఉందని ముందుగా తెలిసిన కూడా ఉపాధ్యాయురాలు సంధ్యారాణి సెలవు పై వెళ్లగా ఉన్న ఒక్క ఉపాద్యాయుడు సమావేశానికి వెళ్లాలనే ఉద్దేశంలో మధ్యాహ్నం భోజనం తరువాత పాఠశాలను వదిలిపెట్టడంతో నే చిన్నారులకు ఈ దుస్థి జరిగి ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని విద్యార్ధి  ఐక్యవిద్యార్ధి సంఘాల నాయకులు రాస్త రోకో చేసి  ఈ మరణానికి  కారకులైన ఉపాధ్యాయులను వెంటనే విడులనుండి తొలగించాలని  డిమాండ్ చేశారు. ఈ సంఘటన స్థలానికి తహసీల్దార్ రమేష్ గౌడ్ పరిశీలించి విద్యార్థుల తలిదండ్రులను ఓదార్చారు. జడ్ పిటిసి బాబురావు , టిఆర్ ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి , రెబ్బెన ఉప సర్పంచ్ శ్రీధర్ కుమార్ , స్థానిక సర్పంచ్ మంతుమేర టౌన్ అధ్యక్షుడు ఆర్ అశోక్ , వట్టివాగు చేర్మెన్ పెంటయ్య , ఖైర్గం సర్పంచ్ వెంకన్న , సుదర్శన్ గౌడ్ లు  బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వాలని కోరగా తహసీల్దార్ స్పందించి కుటుంబానికి ఎకరం నర ఎకరం నర ప్రభుత్వ భూములను అందిస్తామని అన్నారు. విద్యార్ధి ఐక్య సంఘ నాయకులు ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవిందర్, టీవీవీ జిల్లా అధ్యక్షుడు కె సాయి, ఎ ఐ వై  యాప్ జిల్లా ఉపాధ్యక్షుడు బోగె ఉపెందర్లు బాధిత కుటుంబికులకు నష్ట పరిహారంతో పాటు సాహసం చేసి విద్యార్థుల ప్రాణాలు కాపాడిన మహాలక్ష్మిని గుర్తించి రాష్ట్ర సహస బాలిక హవార్డును ప్రదానం చేయాలనీ డిమాండ్ చేసారు      

No comments:

Post a Comment