ప్రభుత్వ కాళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి- టి వి వి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్నం భోజనాన్ని వెంటనే అమలు చేయాలనీ టి వి వి జిల్లా అధ్యక్షుడు కడ్తాల సాయి అన్నారు . రెబ్బన తహశీల్ధార్ కార్యాలయము ముందు బుధవారం ధర్నా చేసి వినతి పత్రాన్ని అందజేశారు . ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకోకుండా విద్యార్థులపై సవతి తల్లి ప్రేమ చూపెడుతున్నదని తెలిపారు . మాటలు తప్పా పనులు చేయడము చేతకాని ప్రభుత్వం అని అన్నారు . మధ్యాహ్న భోజనపథకాన్ని వెంటనే అమలు చేయాలని లేనిచో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచచరించారు. ఈ కార్య క్రమములో టి వి వి నాయకులు సాయి నవతేజ , ప్రదీప్ , శ్రీధర్ , సతీష్ , రజినీకాంత్ , సరితా , నిరోషా , అశ్విని లు పాల్గొన్నారు .
No comments:
Post a Comment