Sunday, 7 August 2016

ఎస్ వి ఇంగీష్ మీడియం లో హరిత హారం

ఎస్ వి ఇంగీష్ మీడియం లో  హరిత హారం 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); నాగుల పంచమి పండగ రోజు ప్రత్యకంగా మండలములోని ఎస్ వి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో పాఠశాల యాజమాన్యం , విద్యార్థులు మొక్కలు నాటారు . ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దీకొండ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు శుభ కార్యాలయాలకు , పండగలకు, పుట్టిన రోజులకు  ఒక్క మొక్క నాటినట్లయితే  ఊరంతా హరితంగా మారుతుందని అన్నారు .ప్రతి గ్రామము లో ఈవిధంగా మొక్కలు నాటితే రాష్ట్రమంతా పచ్చని వనముల తయారు అవుతానందని తెలిపారు . దీంతో ముఖ్యమంత్రి కె సి ఆర్ కళలు కన్నా బంగారు తెలంగాణా హరిత వనంగా మారుతుందని పేర్కొన్నారు . రెబ్బెన మండలములో ఆసిఫాబాద్ ఎం ఎల్ ఏ కోవ  లక్ష్మి ప్రజా సంక్షేమానికి పెద్ద పీట  వేస్తూ , హరిత హారాన్ని ఉద్యమంలా  తీసుకెళ్తున్నారని అన్నారు.

No comments:

Post a Comment