ప్రభుత్వ జూనియర్ కళాశాలను నూతన భవనంలోకి బదిలీ చేయాలి
రెబ్బెనలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలన నూతన భవనంలో బదిలీచేయాలని ఎఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ
నిర్వహించి (కళాశాలనుండి ) ఎం అర్ ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్, ఎఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బోగే ఉపేందర్ మాట్లాడుతూ రెబ్బెన మండలంలో ప్రభుత్వ కళాశాల ప్రారంభం అయినప్పటి నుండి స్థానిక జెడ్ పి ఎస్ ఎస్ పాఠశాలలో కొనసాగుతుందని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని 2010సం.. లో ఎఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రెబ్బెన లో "9" రోజుల పాటు నిరాహార దీక్ష చేయడం జరిగిందని అన్నారు. నిరాహార దీక్షకు స్పందించిన అధికారులు కళాశాల స్థలం కేటాయించారని, గత సంవత్సరం కళాశాల నూతన భవనాన్ని నిర్మించరని అన్నారు .సుమారు 80లక్షల వ్యయంతో భవనాన్ని నిర్మించి సంవత్సరం గడుస్తున్నానేటికీ భవనాన్ని ప్రారంభించకపోవడం వలన విద్యార్థులు t తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. కళాశాలలో సుమారు 600మంది విద్యార్థులు ఉన్నారని గదులు సరిపోక నానా ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు.నూతనంగా నిర్మించిన భవనానికి విద్యుత్ సౌకర్యం , మంచి నీటి సౌకర్యం లేదని కళాశాలను ప్రారంభించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం అన్నారు. వెంటనే అధికారులు స్పందించి నూతన భవనానికి విద్యుత్ సౌకర్యం , మంచి నీటి సౌకర్యం ప్రహరీ గోడ నిర్మించాలని అన్నారు. ఎఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్,ఎఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బోగే ఉపేందర్, ఎఐఎస్ఎఫ్ మండల కార్యదర్శులు రవి , సాయి , నాయకులూ తిరుపతి , మహేందర్ , వెంకటేష్ , విద్యార్థులు పాల్గొన్నారు
No comments:
Post a Comment