Sunday, 14 August 2016

జయ శంకర్ ఆశయాఅభివృద్ధిని సాదిద్దాం ;కోదండరాం

 జయ శంకర్  ఆశయాఅభివృద్ధిని సాదిద్దాం ;కోదండరాం

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ప్రత్యేక  తెలంగాణ  సాధించుకున్న అన్నివర్గాల  అభివృద్ధి కొరకు జయశంకర్ ఆశయాలను నెరవేరుద్దామని ప్రొపెసర్ కోదండరాం అన్నారు. రెబ్బెన అతిధి గృహంలో జె.ఏ .సి విద్యావంతుల ఏర్పాటు చేసిన  ప్రో . జయశంకర్ జయంతి సదస్సు లో ముఖ్య అతిధిగా జె . ఏ  .సి చైర్మన్ ప్రో. కోదండరాం మాట్లాడారు.ప్రత్యేక  తెలంగాణ  సాధించుకుని రెండు సంవత్సరాల నాలుగు నెలలు కవస్తాస్తున్న అన్నివర్గాలకు సమన్యాయం జరగట్లేదు అని , జయశంకర్ ఆశయాలను విద్యావంతులు , మేధావులు ముందుకు నడచి  నెరవేర్చాలని అన్నారు . తెలంగాణ మూడు తరాల ఉద్యమానికి ముందు నడిచి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ,నిధులు,నియామకాలలో జరిగిన అన్యాయాలను ఎదురించి పోరాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రo సాదించుకున్నాము.విద్య, ఆరోగ్యం , వ్యవసాయం పరిశ్రమలు అభివృద్ధి ఏర్పాటు కై విద్యావంతులు , మేధావులు విద్యార్ధిసంఘ నాయకులూ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి జారవేయాలి . అలాగే నిరోద్యగా యువతీ యువకులకు ఉద్యోగాలను కల్పించాలి ,సింగరేణిలో ఓపెన్ కాస్ట్ విధానాన్ని తొలగించి నిరోద్యుగులకు ఉపాధి కల్పించేలా భూ అంతర గనులను ప్రోత్సహించి నిర్వహించాలి . అలాగే సింగరేణి యాజమాన్యం పరిసర ప్రాంత గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించాలని అన్నారు. ఈ సందర్బంగా విద్యావంతులు , ఉద్యమకారులు సంఘo అధ్యక్షులు దుర్గం రవీందర్ ఉద్యమకారులను ఆదుకోవాలని అన్నారు . అదే విదంగా సింగరేణి లో వారసత్వ ఉద్యోగాలను పునురుద్ధరించాలని సింగరేణి సన్స్  అండ్ అసోసియన్ అధ్యక్షులు మల్లికార్జున  వినతి పత్రం ఇచ్చారు . జిల్లాల విభజన జరుగుతున్న సంగర్భాంగా నల్గొండ, వరంగల్ జిల్లాలో ఏదైనా ఒకదానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని రాష్ట్ర రజాకారుల సంగం అధ్యక్షులు కడతల మలయ్య వినతి పత్రం సమర్పించారు. టి.వి.వి. రాష్ట్ర అధ్యక్షులు గురజాల రవీందర్ , టి.వి.వి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.చంద్రశేఖర్, టి.వి.వి. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి.హెచ్.కమల్,టి.వి.వి. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం విస్తారు, టి.వి.వి జిల్లా మహిళా కన్వినర్ ఎస్.లక్ష్మి ఉపాధ్యాయులు, విద్యార్ధి సంఘల నాయకులూ, మేధావులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment