Tuesday, 30 August 2016

ఇచ్చిన హామీలను నెరవేర్చాలి ; ఐకెపి విఓఏ లు

ఇచ్చిన హామీలను నెరవేర్చాలి ; ఐకెపి విఓఏ లు

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికలకు ముందు మరియు పండగలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఐకెపి విఓ ఏ ల చాలిచాలని జీతాలతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని  డివిజన్ ఉపాధ్యక్షుడు గజ్జెలి భీమేష్ అన్నారు . సెప్టెంబర్ 2వ తేది న కేంద్ర రాష్ట్ర కార్మికులు చేపట్టే సమ్మె లో  ఐకెపి గ్రామీణ పేదరిక నిర్ములన సంస్థ లో పనిచేస్తున్న విఓఏ లు కుడా బాగస్వాములౌతామని మంగళవారం నాడు గౌతమి మండల సమాఖ్య రెబ్బెన కార్యాలయంలో ఎపియం వెంకటరమణ కు సమ్మె  నోటిస్ అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండ చాలీచాలని బకాయి జీతాలతో నిరంతరం అన్ని రకాల పనులు చేయించుకుంటూ వేతనాలు చెల్లించకపోవడం అన్యాయం అన్నారు . గ్రామాల్లో  విఓఏ లు స్వయం సహాయక సంఘాల పనులతో పాటు డిపార్ట్ మెంట్ కు సంబందించిన ఇంకా ఇతర అనేక పనులు నిర్వహిస్తున్నారు . వీరికి నెలకు 2000/-ల చొప్పున చెల్లిస్తామని 2013 మే 30 న సెర్ప్ నుండి సర్క్యులర్ జారీ అయింది . కానీ నేటికీ వేతనాలు విడుదల కాలేదన్నారు , స్వయంగా ముఖ్యమంత్రి ఎన్నికల సందర్బంగా అనేక సభల్లో విఓఏ లకు వేతనం 5000/-రూ లకు పెంచుతామని ప్రకటించారు . ఇచ్చిన హామీలను అమలు చేసి విఓఏ ల  న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు  .   డిమాండ్స్  :- 2013 జూన్ నుండి 38 నెలల బకాయి వేతనాలు చెల్లించాలి , ప్రభుత్వం ఎన్నికల సందర్బంగా పెంచుతానన్న రూ .  5000/-లు వేతనం పెంచాలి, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి ,ఆరోగ్యబీమా సదుపాయం కల్పించాలి ,సెర్ప్ హెచ్ . ఆర్  ను వర్తింపచేయాలి ,సంఘాలకు వి ఎల్ ఆర్ వడ్డీలేని రుణాలు 10 లక్షల వరకు పొడిగించాలి ,చనిపోయిన విఓఏ కుటుంబాల సభ్యులకు ప్రమాద బీమా అమలు చేయాలనీ డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో డోంగ్రీ తిరుపతి , క్రిష్ణ , శ్రీకాంత్ , రవి , శ్రీనివాస్ , ,శంకర్ ,చంద్రశేఖర్ ,ch తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment