Tuesday, 9 August 2016

అంగన్వాడీ కేంద్రములో కలకలం రేపిన నాగు పాము

అంగన్వాడీ కేంద్రములో కలకలం రేపిన నాగు పాము 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  రెబ్బెన మండల కేంద్రములో సబ్  స్టేషన్ సమీపములో గల అంగన్వాడీ కేంద్రములో సోమవారం నాగు పాము కలకలం రేపింది . అంగన్వాడీ గదిలో ఆయా పద్మ శుబ్రము చేయడానికి వెళ్లగా పాము బుసకొట్టగా  బయటికి   పరుగు తీసింది . గది  మూలన కోడిగ్రుడ్లు పెట్టి ఉన్నాయి .గ్రుడ్లను తాగుతూ మూలాన ఉన్నట్లు ఆమె తెలిపారు .     ఇరుగు పొరుగు వారు వఛ్చి పాము ను చూసి అతి జాగత్తగా కర్రలతో చంపేశారు .  ప్రమాదం తప్పడంతో  వారు  ఊపీరి పీల్చుకున్నారు 

No comments:

Post a Comment