దేశవ్యాప్త సమ్మె ను విజయవంతం చేయండి - వాసిరెడ్డి సీతారామయ్య
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); కార్మికుల హక్కుల సాధన కోసం సెప్టెంబర్ 2వ తేదీన జరిగే టోకెన్ సమ్మెను సింగరేణిలో విజయవంతం చేయాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య కోరారు. గురువారం గోలేటిలోని కె ఎల్ మహీంద్రా భావన్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ సమ్మెకు జాతీయ సంఘాలు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నాయన్నారు. బొగ్గు గనుల జాతీయకరణ చట్టాన్ని మార్పుచేయాలని చూస్తోందన్నారు. పర్మినెంట్ కార్మికులకు టర్మినల్ బెనిఫిట్ ఉండబోవన్నారు. పెట్టుబడి దారులకు కొమ్ముకాసే విధంగా మోదీ ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయన్నారు. టోకెన్ సమ్మెకు బీజేపీ అనుబంధ బీఎంఎస్‌తో పాటు జాతీయ కార్మిక సంఘాలన్నీ పిలుపునిచ్చాయన్నారు. సమ్మెను విచ్ఛిన్నం చేసేవారిని గుర్తించి యూనియన్‌లో తొలగించేందుకు జాతీయ కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయన్నారు. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల వైఫల్యం వల్లే సింగరే ణిలో సమస్యలు జఠిలంగా మారాయన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సంస్థ సీఅండ్‌ఎండీని కలిసి సమస్యలపై వినతి పత్రం అందజేశామన్నారు. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కలవనున్నట్లు పేర్కొన్నారు.సమ్మె కాలపు వేతనాలు సమానంగా అందరికి ఇవ్వాలని తెలిపారు . వారసత్వ ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలి డిమాండ్ చేశారు . విలేకరుల సమావేశంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్ , సెంట్రల్ కార్యదర్శి మస్కా సమ్మయ్య బ్రాఞ్చ కార్యదర్శి ఎస్ తిరుపతి , నాయకులుచిప్ప నర్సయ్య , శోకాలు రశీనివాస్ , ఎహ్ రమేష్ , లష్మినారాయనా బాపన్న , ప్రకాష్ లు ఉన్నారు.
No comments:
Post a Comment