Friday, 5 August 2016

టి ఆర్ ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పథకాలకు నాంది ;ఎం ఎల్ ఏ కోవా లక్ష్మి

టి ఆర్ ఎస్  ప్రభుత్వం అభివృద్ధి పథకాలకు నాంది ;ఎం ఎల్ ఏ కోవా లక్ష్మి


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); టి అర్ ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పథకాలను అమలు చేయడంలోముందుంటుందని గత ప్రభుత్వాలు చేయలేని సంక్షేమ పథకాలను మన తెలంగాణ ప్రభుత్వం గ్రామాలు ,మండల స్థాయిలలో అభివృద్ధి పనులని చేస్తుందని   ఎం ఎల్ ఏ కోవా లక్ష్మి అన్నారు. శుక్రావారం రెబ్బెన మండలంలోని శ్రీరామ కాలనీ ఒకటవ నెం. వార్డులో  పదకొండు లక్షల ఇరవైవేల వ్యయంతో సి.సి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చేయలేని పనులను ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటూ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ముందంజలో ఉందని అన్నారు అలాగే శ్రీరామ కాలనీలో మంచి నీటి ఎద్దడి ఉండటం వల్ల మూడున్నర లక్షల వ్యయంతో నాన్ సి అర్ నిధుల నుంచి మంచినీటి బోర్ వెల్ ను ప్రారంభించారు. ఎండాకాలంను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలని , బోర్ వేల్ ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఐ టి డి ఏ నుంచి పంతొమ్మిది  కోట్లు మంజూరు అయ్యాయి, గిరిజన గ్రామా అభివృద్ధి కోసం వినియోగిస్తామన్నారు. అలాగే నంబాల గ్రామం లో యాభై లక్షల వ్యయంతో   సి.సి రోడ్లు ,డ్రైనేజీలు మరెన్నో పతకాలను అమల్లో పెట్ట మన్నారు . ఈ సందర్బంగా  కాలనీ వాసులు ఇళ్ల మధ్యలో అడ్డంగా ఉన్న లెవెన్ కె వి విద్యుత్ తీగలను తొలగించి పక్కకు వేయాలని కోరారు ఆమె స్పందించి  లెవెన్ కె వి విద్యుత్ తీగలను తొలగిస్తామని సంబంధిత అధికారులకు సిపారసు చేశామని  అన్నారు   డి8-10 కెనాల్ నుంచి పంటపొలాలకు నీరు రావట్లేదని పిర్యాదు చేయగా సంబంధిత అధికారులతో సంప్రదించి మరమ్మత్తు పనులు చేపట్టి నీరందేలా చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్  మార్కెట్ చెర్మన్ గంధం శ్రీనివాస్,  వైస్  చెర్మన్ కుందారపు శంకరమ్మ, యం పిపి కార్నతం సంజీవ్ కుమార్, జడ్ పిటిసి బాబురావు  , సర్పంచ్ పెసరు వెంకటమ్మ ,  వైస్ యం పిపి గొడిసెల రేణుక , తహసీల్దార్ బండారి రమేష్ గౌడ్, యంపిడిఓ సత్యనారాయన సింగ్, వైస్ ఎమ్ పి పి గుడిసెల రేణుక,తూర్పు జిల్లా ఉప అధ్యక్షుడు నవీన్ కుమార్ జైస్వాల్,  సర్పంచ్ పెసరి వెంకటమ్మ, నంబాల సర్పంచ్ పి.సుశీల,ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్ , సింగిల్ విండో డైరెక్టర్  మధునయ్య, మండల అధ్యక్షులు పోటు శ్రీధర్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు రాపర్తి అశోక్ డైరెక్టర్ గజ్జెల సత్యనారాయణ,మల్రాజ్ శ్రీనివాస్,  సుదర్శన్ గౌడ్, చెన్న సోమశేఖర్,వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment