Monday, 15 August 2016

గుప్త నిధుల కలకలంతో అధికారుల పరిశీలన

గుప్త  నిధుల కలకలంతో అధికారుల పరిశీలన


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలములోని ఎల్లమ్మ చెరువు క్రింద గుప్తా నిధులు దొరికినట్లు ఆదివారము కలకలం రేగిన విషయం అందరికి తెలిసినదే. రెబ్బెన గ్రామములోని ఎల్లమ్మ చెరువు క్రింద రెండవ విడుత మిషిన్ కాకతీయ  పనులలో ప్రొక్లైన్లలతో చెరువు కట్టాదిగువన  మట్టిని తోడుతూ ఉండగా రెండు బిందెలు దొరికినట్లు గ్రామస్తులు అనుకుంటుండగా పత్రికలలో వచ్చినా  కథానానికి స్పందించిన  తహశీల్ దార్ బండారి రమేష్ గౌడ్ ఎస్.ఐ దారం సురేష్ లు గుప్తా నిధులు దొరికాయి అని భావిస్తున్న ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు ఆప్రాంతంలో దొరికినటువంటి కుండా పెంకులు డంగు సున్నం ను సేకరించారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వారు వెల్లడించారు గ్రామస్థుల కథనం ప్రకారం గత మార్చి నెలలో ప్రొక్లైన్లతో పాత చెరువు కట్ట కింద మట్టి తోడుతూ ఉండగా ఆయాకట్టు రైతులు అడ్డు పడి  సబ్ కలెక్టర్ కు పిర్యాదు చేశారు. ఐన కానీ సదరు కాంట్రాక్టరు, ఇరిగేషన్ జూనియర్ ఇంజనీర్ వినకుండ  చెరువు కట్ట దిగువన మట్టిని  తోడించినట్లు రైతులు తెలిపారు.చెరువు కట్ట దిగువన పంటలు వేస్తున్న రైతులకు డంగు సున్నం తో కఠిన కట్టడాలు కనబడటంతో ఆ ప్రాంతంలో గుప్తా నిధులు దొరికి ఉంటాయని అనుకుంటున్నారు ఆ నోటా ఈ నోటా అనుకుంటూ ఉండగా   డంగు సున్నముతో ఆనవాలు కనబడుతున్న ప్రదేశానికి సోమవారం ప్రజా ప్రతినిధులు చెరువు కట్టకు వెళ్లి డెంగు  సున్నముతో ఉన్నా గోలేములను చూసి గుసగుసలు చెప్పు కుంటున్నారు. మిషన్ కాకతీయ  . చెరువు కట్టపై విచారణ జరిపించాలని పలువురు కోరుతున్నారు.      

No comments:

Post a Comment