పంచాయితిలో హరితహారం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన గ్రామపంచాయతి ఆవరణంలో గురువారం సర్పంచ్ పెసరు వెంకటమ్మ మరియు మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ కుందారపు శంకరమ్మలు మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతు మనరాష్ట్ర ముఖ్యమంత్రి కలలుకన్న బంగారు తెలంగాణ హరిత వర్ణం కావాలంటే ప్రతిఒక్కరు మొక్కలు నాటి వాటి సంరక్షణ కార్యకలాపాలు చూసుకోవాలన్నారు అలానే మండలంలోని ఉత్తమ గ్రామపంచాయితిగా పేరుపొందాలని హరిత హారంలో భాగంగా మొక్కలు నాటుతూ వాటి ఆలనా పాలన చూసుకుంటున్నామన్నారు . ఈ కార్యక్రమంలో కార్యదర్శి మురళీధర్ , సింగిల్ విండో డైరక్టర్ మధునయ్య , రాజేశ్వరి , అంగనివాడి కార్యకర్తలు బాలమ్మ , సువర్ణ , భూదేవి , సంబాలక్ష్మి , పద్మ , తిరుపతమ్మ , శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment