రెబ్బెనలో జెండా వేడుకలు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని తహశిల్దార్ కార్యలయంలో సోమావారం ఎమార్వో రమేష్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలకు ఆయన ఈ సందర్భంగా 70వ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రగతికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి ఎస్సై డి . సురేష్ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు,ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్ ,ఎంపీపీ కార్నధం సంజీవ్ కుమార్.జడ్పిటిసి బాబురావు తదితర ప్రజా ప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే మండలంలోని కార్యాలయాలలో జెండాలు ఎగరవేశారు గోలేటి బెల్లంపల్లి ఏరియా లోని జీఎం రవిశంకర్ జెండాను ఎగరవేశి కార్మికులు ,కార్మికుల కుటుంబాలకు 70వ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.
No comments:
Post a Comment