విద్యార్థులకు బస్సు సౌకర్యం కలిపించాలి; పుదారి సాయికిరణ్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బన మండల కేంద్రం నుండి జక్కులపల్లి గ్రామానికి మధ్యాహ్నం వేళలో ఆర్ టి సి బస్సు నడపాలని , గ్రామాల నుండి వచ్చే విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని ఎ ఐ ఎస్ ఫ్ డివిజన్ కార్యదర్శి పుదారి సాయికిరణ్ అన్నారు . అఖిల భారత విద్యార్థి సమాఖ్య అద్వర్యం లో రెబ్బెన తహశీల్ధార్ రమేష్ గౌడ్ కు వినతి అందజేశారు . అనంతరం మాట్లాడుతూ మండల కేంద్రం లో ఉన్న ప్రభుత్వ కళాశాలలో ఉదయం పాఠశాల మధ్యాహ్నం వేళలో కళాశాల నడపడం వలన విద్యార్థులు జక్కులపల్లి నారాయణపూర్ కిష్టాపూర్ కొమురవెల్లి గ్రామాల నుండి విద్యార్థులు సుమారు వందమంది ఉదయం పూట బస్సు లో రావడం జరుగుతుందని తిరుగు ప్రయాణానికి బస్సు లేకపోవడం వళ్ళ విధ్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ప్రైవేట్ వాహనాలను ఆశ్రహించడం వలన ఆర్ధికంగా నష్టపోతున్నారని అన్నారు . కళాశాలలో మద్యాహ్న భోజన పధకం అమలులో లేనందున ఉదయం నుండి సాయంత్రం వరకు విద్యార్థులు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొన్నదని విద్యార్థుల సమస్యను అర్ధం చేసుకొని ఆర్ టి సి బస్సు నడిపించేలా కృషి చేసి విద్యార్థులకు న్యాయం చేయాలనీ అన్నారు.ఈ దారుల్లో బస్సు ప్రయాణించడం వలన విద్యార్థులతో పాటు పేద ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు . ఈ కార్యక్రమాం లో ఎ ఐ ఎస్ ఫ్ మండల నాయకులు పడాల సంపత్ జాడిసాయి శేఖర్ సందీప్ విద్యార్థులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment