Tuesday, 9 August 2016

విద్యుత్ షాట్ సర్కిట్ తో 4గృహాలు ద్వాంసం తీరని ఆస్థి నష్టం


విద్యుత్  షాట్   సర్కిట్ తో 4గృహాలు ద్వాంసం తీరని ఆస్థి నష్టం 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఇంట్లో ఎవరు లేని సమయంలో విద్యుత్ షాట్ సర్కిట్ తో గ్యాస్ సిలిండర్లు పేలి 4 పెంకుటిండ్లు కాలిపోయి తీరని ఆస్థి నష్టం జరిగింది ఈ దుస్థితి    రెబ్బెన మండలంలో ని గంగాపూర్ లో మంగవారం చోటు చేసుకుంది.గంగాపూర్ కు చెందిన గుర్లె లచ్చయ్య వారి కుమారులు బాబురావు , రమేష్ , సత్తయ్య  ఇండ్లు ప్రక్క ప్రక్కన ఉండడం వలన విద్యుత్ షాట్ సర్కిట్ తో ఉదయం సుమారు 10గంటల ప్రాతంలో వంటపనులు ముగించుకొని ఇంట్లోని వారందరు పొలం పనులకు వెళ్లగా ఈ సంఘటన జరిగిందని స్థానికులు పేర్కొన్నారు . ఈ సంఘటన స్థలానికి మండల తహసీల్దార్ బండారు రమేష్ గౌడ్ చేరుకోని  బాధితులను పరామర్శించి ఆస్థి  నష్టటం గురించి ఆరా తీశారు. బాధితులకు తీరని నష్టము జరిగిందని  కట్టు బట్టలు తప్ప వేరే ఏమి మిగులలేదని రేషన్ డీలర్ శంకర్ ను పిలిచి కుటుంబానికి 20కిలోల బియ్యం , కిరోషిన్ నూనె మరియు చెక్కర తక్షణమే అందించాలని ఆదేశించారు. అలాగే బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం కూడా అందించారు.ధాన్యం బస్తాలు , నగదు, నగలు ,  ఎరువులు , విలువైన సామగ్రి వాటివిలువ సుమారు 11లక్షల 66వేలు ఉంటుందని అంచనా వేశారు.   

No comments:

Post a Comment