Wednesday, 17 August 2016

మహిళా విభాగం నుంచి కుంధారపు శంకరమ్మకు ఘనసన్మానం

 మహిళా విభాగం నుంచి కుంధారపు శంకరమ్మకు ఘనసన్మానం

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); తెలంగాణ ప్రభుత్వం లో గత 12 సం నుంచి మహిళా విభాగం నుంచి చురుకుగా కార్యనిర్వహణ పాల్గొనటంవలన ప్రభుత్వం గుర్తించి కుంధారపు శంకరమ్మకు ఆసిఫాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ పదవిని ఇవ్వడం  సంతోషకరమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ జే బి ప్రమీల న్యాయవాది అన్నారు.  రెబ్బెన లో  ఆమె స్వగృహం నందు  మంగళవారం  కుంధారపు శంకరమ్మకు  ఘనసన్మానం చేశారు.మహిళలు అన్ని రంగాల్లో రాణించి యీలాంటి మరెన్నో పదవులు రావాలని మహిళా విభాగం నుండి కోరుకుంటున్నారు .  ఈ  సందర్బంగా జంపల్లి భారతి , కనకలక్ష్మి ,రాజేశ్వరి , సుజాత , స్వరూప , పద్మ , లతా , రజిత,అమృత,పోషమ్మ ,మహిళా విభాగం కార్యకర్తలు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment