కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు వి ర్ ఏ ల సమస్యలపై వినతి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఉద్యోగ , కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ 2016, సెప్టెంబర్ 2 న దేశ వ్యాప్త సమ్మె చేయాలనీ కేంద్ర కార్మిక సంగాల , ఉద్యోగ ఫెడరేషన్లు , ప్రభుత్వ రంగ సంస్థలు ఐక్యంగా ఇచ్చిన పిలుపు మేరకు సెప్టెంబర్ 2 రెబ్బెన వి.ర్.ఏ లు సమ్మెచేయనున్నారని బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం లో ఉప తహసీల్దార్ రామ్ మోహన్ రావు కి వినతిపత్రం సమర్పించారు . అనంతరం సి ఐ టి యూ సి జిల్లా కమిటీ సభ్యులు కృష్ణమ చారి మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని వి . ర్ ఏ ల కు కనీస వ్యత నం నెలకు 18, 000 రూపాయలు చెల్లించాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అర్హత కలిగిన వారికీ ప్రమోషన్ లు ఇవ్వాలని పి . ఎఫ్ , ఈ . ఎస్ . ఐ ,బోనస్ చట్టాలను అమలు చేసి అందరికి పెన్షన్ అందేలా చూడాలన్నారు . ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ డివిజన్ వి. ర్ . ఏ ల అధ్యక్షులు ఎస్ . డి. అఙ్గార్ అలీ , వి . ర్ ఏల సంఘము అధ్యక్షులు కే . వెంకటేశం వి . ర్ ఏలు పోషమల్లు , నానయ్య , రాజలింగు , రాజు , తిరుమల లు తదితరులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment