Saturday, 27 August 2016

మార్కెట్ కమిటీ అధ్యర్యంలో పశువైద్య శిబిరం

మార్కెట్ కమిటీ అధ్యర్యంలో పశువైద్య శిబిరం 
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రంలో నక్కలా గూడెం లో పశు వైద్య శిబిరాన్ని శనివారం ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ  ఆధ్వర్యంలో పశువైద్య సిబ్బంది పశు వైద్య  శిబిరం నిర్వాయించారు.  గ్రామపంచాయితిలో  వర్షకాలం ప్రారంభం అవడం వలన పశువులకు వ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్తగా 290ఆవులకు జబ్బ వాపు టీకాలు ,118 గేదెలకు గొంతు గురుక టీకాలు,252 మేకలకు నట్టల మందు,లివర్ టానిక్ ఎవ్వడమైంది . ఇందులో 60 మంది రైతులు ఇట్టి వైద్య సేవలను పొందారు మొత్తం 660 పశువులకు పశు వైద్యాది కారి అన్నారు.మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ గంధం శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఈ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 5 మండలాలు గలవు ప్రతి మండలం లో ఒక్కొక్క పశు  వైద్య శిబిరము నిర్వహించుటకు గాను మార్కెటింగ్ శాఖ వారు నిధులు మంజూరి ఎవ్వడమైంది . ఇట్టి అవకాశాన్ని రైతు సోదరులు వినియోగించుకోవాలని సూచించారు.మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కుందారపు శంకరమ్మ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పశు వైద్య సేవలను పొందుచు పశువులను సంరక్షించుకున్నప్పుడే వాటిని వ్యవసాయంలో వినియోగించుకొనే వీలవుతుందని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పల్లె రాజేశ్వర్ రావ్ ,గ్రామా సర్పంచ్ పెసర వెంకటమ్మ , పి .ఏ .సి . ఎస్ డైరెక్టర్ గజ్జెల సత్యనారాయణ  పశువైద్యాధికారి సాగర్, మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీ తోట విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment