బెల్లంపల్లి ఏరియాలో వర్షా పాతంతో బోగ్గు ఉత్పత్తికి ఆటకం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); సింగరేణి బెల్లంపల్లి ఏరియా లోని కైరుగూడ,డోర్లి 1 అండ్ 2 ఉపరితలగనుల్లో వర్షాల ప్రభావంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం జరిగిందని బెల్లంపల్లి ఏరియా జి యం రవిశంకర్ అన్నారు. సోమవారం రెబ్బెన మండలంలో గోలేటి జి ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జి ఎం రవిశంకర్ మాట్లాడుతూ అధిక వర్ష పాతం నమోదు అవడం వల్ల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరు కోలేదన్నారు. జులై నెలాఖరుకల్లా 4.86. 000 వేల టన్నులకు గాను 3. 21. 688 టన్నుల ఉత్పత్తి సాధించినట్లు ఏరియా జి యం అన్నారు. గత సంవత్సరానితో పోల్చుకుంటే ఈ ఏడాది వర్ష భావం పెరిగినట్లు అందువల్లే ఉత్పత్తి తాగిందని రానున్న రోజుల్లో మరింత మెరుగయినా ఉత్పత్తి సాధిస్తామని తెలిపారు. హరిత హారంలో భాగంగా మొత్తం సింగరేణి ఏరియా లోనే అగ్ర స్థానంలో బెల్లంపల్లి ఏరియా నిలిచిందని 13 లక్షా మొక్కలకు గాను 4 లక్షల 50 వేల మొక్కలు నాటడం జరిగిందని ఈ సందర్బంగా తెలిపారు.
No comments:
Post a Comment