గిరిజనులకు రాజంగంలో కలిపించిన చట్టాలను అమలు చేయాలి ;
గిరిజన సేవ సంఘ్ ఆసిఫాబాద్ కన్వీనర్ చోవాన్ సంతోష్
గిరిజన సేవ సంఘ్ ఆసిఫాబాద్ కన్వీనర్ చోవాన్ సంతోష్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఆదివాసుల గిరిజనులకు అన్నిరకాల ఉద్యోగాలు ఇస్తు రాజంగంలో కలిపించిన గిరిజన చట్టాలను అమలు చేయాలని జె యం బి గిరిజన సేవ సంఘ్ ఆసిఫాబాద్ కన్వీనర్ చోవాన్ సంతోష్ అన్నారు బుధవారం ఆదివాసీ సమస్యలపై రెబ్బెన ఉప తహసీల్దార్ రాంమోహన్ రావు కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతు ఆదివాసి గిరిజనులను నిర్వహితులను చేసే టైగర్ జూన్ ఓపెన్ క్యాస్ట్ , బారి నీటిపారుదల ప్రాజెక్టులను వెంటనే రద్దు చేయాలి , జీ ఓ యం యస్ నంబర్ 3 ని అమలు చేస్తు అన్ని రకాల ఉద్యోగాలను ఆదివాసీ గిరిజనులకు మాత్రమే ఇవ్వాలని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పూర్తి స్థాయి వసతులు కల్పిస్తు అలాగే క్రొత్తగా ఏర్పడిన కొమరం భీమ్ జిల్లాలో గిరిజన కోసం ఐ టి డి ఎ ను ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గిరిజన సేవ సంఘ్ ఆసిఫాబాద్ కో కన్వీనర్ బానోత్ తిరుపతి, నాయకులు సతీష్ , వినయ్ , శ్రీనివాస్ , సుబ్బారావు , కైలాష్ తదితరాలు ఉన్నారు.
No comments:
Post a Comment