ప్రమోషన్లు పొందిన రెవిన్యూ సిబ్బందికి సన్మానం
ప్రమోషన్లు పొందిన రెవిన్యూ సిబ్బందికి సన్మానం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలములో ని రెవిన్యూ సిబ్బంది నలుగురిని తహశీల్ధార్ బండారి రమేష్ గౌడ్ సోమవారం ఘనంగా సన్మానించారు . మండల కేంద్రములో విల్లెజ్ రెవిన్యూ అసిస్టెన్స్ గా గతా కొన్ని సంవత్సరాలుగా పనులు చేసి అధికారుల మన్ననలు పొందారు . దుర్గం దేవాజి, డోంగ్రి గణపతి , దుర్గం గంటయ్య , గోగర్ల రమేష్ లకు ఉన్నత పదవి గ్రామ కార్య దర్శిగా ప్రమోషన్ లు పొందారు . వీరిని పుష్ప గుచ్చ్చాలతో , శాలువాలతో రెవిన్యూ సిబ్బంది ఘనంగా సన్మానించారు . ఈ సందర్బంగా తహశీల్ధార్ బి రమేష్ గౌడ్ మాట్లాడుతూ గ్రామాలలోని రైతుల సమస్యలను పకడ్బందీ గా తెలుసుకొని వారికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేసి పెట్టాలని అన్నారు . వారు చేసిన సేవలను కొనియాడారు . ఈ కార్య క్రమములో డిప్యూటీ తహశీల్ధార్ రామ్మోహన్ రావు , సిబ్బంది యంలాల్ , శంకర్ జోహార్ , తదితరులు ఉన్నారు .
No comments:
Post a Comment