రెబ్బెనలో గుప్త నిధుల కలకలం ........ ?

![]() |
Add caption |
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మందలములోని ఓ చెరువు క్రింద గుప్తా నిధులు దొరికినట్లు ఆదివారము కలకలం రేపింది . రెబ్బెన గ్రామములోని ఎల్లమ్మ చెరువు క్రింద రెండవ విడుత మిషన్కాకతీయ పనులలో ప్రొక్లైన్లలతో చెరువు కట్టాను తోడుతూ ఉండగా రెండు బిందెలు దొరికినట్లు గ్రామస్తులు అనుకుంటున్నారు . గత మార్చి నెలలో ప్రొక్లైన్లతో పాత చెరువు కట్టాను తోడుతూ ఉండగా ఆయా కట్టు రైతులు అడ్డు పడి సబ్ కలెక్టర్ కు పిర్యాదు చేశారు . ఐన కానీ సదరు కాంట్రాక్టరు, ఇరిగేషన్ జె యి వినకుండ చెరువు కట్టాను తోడించినట్లు రైతులు ఆరోపించారు. అక్కడ డంగు సున్నముతో కట్టించినట్లు 2 గోలేములు తీసినట్లు ఆనవాలు కనబడుతున్నాయి . దీంతో ఆది వారం రెబ్బెన ప్రజలు తండోపతండాలుగా చెరువు కట్టకు వెళ్లి డెంగు సున్నముతో ఉన్నా గోలేములను చూసి గుసగుసలు చెప్పు కుంటున్నారు . మిషన్ కాకతీయ . చెరువు కట్టపై విచారణ జరిపించాలని పలువురు కోరుతున్నారు .
No comments:
Post a Comment